×

9Staar TV's video:

@రాయదుర్గం ప్రజలకు ఆధార్ తిప్పలు ఆదార్ లింకేజి కోసం అర్థరాత్రి నుండే వందలాది క్యూ
అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రజలకు ఆధార్ తిప్పలు తప్పడం లేదు. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ వద్ద ఆదార్ లింకేజి కోసం అర్థరాత్రి నుండే వందలాది క్యూకట్టారు. వారం వారం ఆధార్ లింక్ చేయడం కోసం కొద్ది మంది టోకెన్లు ఇస్తుండటంతో ఆ టోకెన్లు దక్కించుకునేందుకు సోమవారం తెల్లవారుజాము ఒంటిగంట, రెండు గంటల నుండే వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి చేరుకుని క్యూ లైన్ లో వున్నారు. మరికొంత మంది ముందురోజు రాత్రి వచ్చి అక్కడే పూడుకున్న వారూ ఉన్నారు. అకౌంట్ కు ఆధార్ లింక్ కాకపోవడంతో పెన్షన్ లు ఇతర సంక్షేమ పథకాలు నిలిపివేయడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో గతంలో ఉన్న సెంటర్లు మూతేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుండి రాయదుర్గం ఎస్ బి ఐ వద్ద కే తరలి వస్తున్నారు. గత రెండు మూడు వారాలుగా టోకెన్లు కోసం తొక్కిసలాట జరిగిన సందర్బాలు వున్నాయి, టోకెన్లు కోసం వృద్ధులు కాళ్లు విగ కొట్టుకోవడం సర్వసాధారణమైంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడం లేదని వృద్ధులు వాపోయారు. ఇప్పటికైనా మీసేవ కేంద్రాలలో గానీ, సచివాలయాల్లో గానీ ఆధార్ లింక్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు బైట్స్ : క్యూ లైన్లో ఉన్న వృద్ధులు

0

0
9Staar TV
Subscribers
17.1K
Total Post
697
Total Views
63.3K
Avg. Views
727.9
View Profile
This video was published on 2020-12-14 15:59:19 GMT by @9Staar-TV on Youtube. 9Staar TV has total 17.1K subscribers on Youtube and has a total of 697 video.This video has received 0 Likes which are lower than the average likes that 9Staar TV gets . @9Staar-TV receives an average views of 727.9 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that 9Staar TV gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @9Staar TV