×

Dr Guravareddy Annapareddy's video: Happy birthday Dr Kavya Little Soldiers Dr A V Gurava Reddy

@Happy birthday Dr. Kavya | Little Soldiers | Dr. A.V Gurava Reddy
నేను జీవితం లో గట్టిగా కోరుకున్నవి రెండే రెండు ఒకటి Doctor అవ్వాలని, రెండు Daughter కావాలని! మిగితావన్ని దైవ సంకల్పాలే.. భగవంతుడి దయతో రెండూ నెలవేరాయి, Doctor అవ్వడం వల్ల నా వంతు ఉడతా భక్తిగా సమాజానికి సాయం చేయగలిగితే, Daughter ఉండటం వల్ల నేనంటూ ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను! అంతేగా, ఇంటి ఆడపిల్లలే ఆ ఇంటి ఆనందాలకు పెన్నిధి, దిక్సూచి! పుడుతూ, భుజాలమీద ఎత్తుకొని తిరిగిన బరువులనుంచి, మెట్టినింటికి వెళుతూ, అదే భుజాన వాలి కార్చే కన్నీటి జ్ఞాపకాల వరకు, ఆడపిల్ల, ఓ అద్వైత అనుభవాల కూడిక, గుండె బరువెక్కించే జ్ఞాపకాల అమరిక! మా అబ్బాయి ఆదర్శ్ నా ఈ 'కూతురు పిచ్చి' ప్రేమ పట్ల కొంత ఈర్ష పడుతూ గొడవ పడినా, నేను ఎప్పుడూ కూతురు కూచినే! తండ్రి కొంగు చాటు బిడ్డలున్నట్టే కూతురు చున్నీ చాటు తండ్రులు కొందరుంటారు(ఈ మధ్య చీరలు కట్టట్లేదు కదా) అలాంటి తండ్రుల జాబితాలో ప్రప్రధముడిని నేను! ఆడపిల్లని కని పెంచడం లో వున్న మాధుర్యం ఓ తండ్రినడిగితేనే తెలుస్తుంది! బుడి బుడి అడుగులని అరచేతుల మీద మోస్తూ, తన నోటి వెంట వచ్చిన కోరికను భూమి ఆకాశాలను ఏకం చేసైనా తీరుస్తూ, ఆఖరికి, కూతురిచ్చే ఆ కొంటె చిరునవ్వు, కౌగలింత ప్రపంచాన్నే మరిచేలా చేస్తుందనడం లో ఏ అతిశయోక్తి లేదు! అలాంటి కౌగలింతలను, చిరునవ్వులు, కొంటెతనాలను అందిస్తూ ఈ అరవైలు దాటే గురవయ్యకు, గుండె నిండా సంతోషాలు ఇవ్వాలనే ఓ తరహా స్వార్ధంతో, నిన్న కాక మొన్న little solider గా మనందరినీ అలరించిన కావ్యమ్మకు అప్పుడే cardiologist అయ్యి, ఇద్దరి పిల్లల తల్లిగా మారిన మా ఇంటి 'Good Girl'కు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు!

73

0
Dr Guravareddy Annapareddy
Subscribers
67.1K
Total Post
103
Total Views
6.6M
Avg. Views
84K
View Profile
This video was published on 2023-04-03 18:02:17 GMT by @Dr-Guravareddy-Annapareddy on Youtube. Dr Guravareddy Annapareddy has total 67.1K subscribers on Youtube and has a total of 103 video.This video has received 73 Likes which are lower than the average likes that Dr Guravareddy Annapareddy gets . @Dr-Guravareddy-Annapareddy receives an average views of 84K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Dr Guravareddy Annapareddy gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Dr Guravareddy Annapareddy