×

Mana Telugu Vartalu's video: Krishna river boat tragedy: Death toll rises to 20 ex-gratia announced

@Krishna river boat tragedy: Death toll rises to 20, ex-gratia announced
అమరావతి: వారంతా ఎంతో ఆనందంగా విహారయాత్రకు తరలివచ్చారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించారు. సాయంత్రం పవిత్ర సంగమం వద్ద జరిగే నిత్య హారతిని తిలకించాలని భావించారు. విధి వక్రీకరించింది. పడవ రూపంలో మృత్యువు వారిని కబళించింది. పవిత్ర గోదావరి జలాలు కృష్ణాలో కలిసే చోట వారు ఎక్కిన పడవలో ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి. అది పక్కకు ఒరిగింది. అదే సమయంలో దానిని నడిపే డ్రైవరు పడవను మలుపు వద్ద పక్కకు తిప్పాడు. అక్కడే ఇసుక మేటలు ఉండడంతో ... అది బోల్తా పడింది. ఈత వచ్చిన వారు ఈదుకుంటూ రాగా... కొందరు పడవను పట్టుకుని వేలాడుతూ ప్రాణాలను రక్షించుకోగా... మిగిలిన వారు జలసమాధి అయ్యారు. మృతుల్లో ఎక్కువగా ఒంగోలు వాసులే ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. నదిలో నడిపేందుకు ఈ పడవకు ఎటువంటి అనుమతులు లేవు. ఉదయం దీన్ని నిర్వాహకులు ప్రయోగాత్మకంగా పరీక్షించారు. పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండానే సాయంత్రం పడవను నడిపారు. అదే ప్రమాదానికి మూలమైంది. పెనువిషాదానికి దారితీసింది. కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 19 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి. విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి పవిత్రసంగమం వద్దకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది ఒంగోలుకు చెందిన వారే.కృష్ణా నది పడవ ప్రమాదం ఘటన తెలియగానే విపత్తు స్పందన దళాలు చురుగ్గా స్పందించాయి. సమాచారం అందుకున్న అరగంటలోపే మంగళగిరి నుంచి జాతీయ విపత్తుల స్పందన దళం నుంచి రెండు బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఒక్కో బృందంలో 30మంది సభ్యులు, ఈతగాళ్లు ఉన్నారు. అలాగే 45 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర విపత్తుల స్పందన దళం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకొంది. అగ్నిమాపక శాఖ నుంచి 60 మంది వెళ్లారు. ఈ బృందం వెంట 12 ఐఆర్‌ బోట్లను తీసుకుని వెళ్లారు. మరో నాలుగు ఆస్కాలైట్‌ పడవలను వినియోగించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు మాట్లాడుతూ భారత వైమానిక దళం అధికారులతో మాట్లాడి అత్యవసరమైతే వినియోగించేందుకు హెలికాప్టర్‌ను కూడా సిద్ధం చేసుకున్నామని తెలిపారు.

0

0
Mana Telugu Vartalu
Subscribers
220
Total Post
60
Total Views
38.4K
Avg. Views
768.1
View Profile
This video was published on 2017-11-13 18:09:19 GMT by @Mana-Telugu-Vartalu on Youtube. Mana Telugu Vartalu has total 220 subscribers on Youtube and has a total of 60 video.This video has received 0 Likes which are lower than the average likes that Mana Telugu Vartalu gets . @Mana-Telugu-Vartalu receives an average views of 768.1 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Mana Telugu Vartalu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @Mana Telugu Vartalu