×

Movie Focus's video: Prabhas Rejected Movies Movies that Prabhas gave up in his 17-year movie career

@Prabhas Rejected Movies | Movies that Prabhas gave up in his 17-year movie career
Prabhas Rejected Movies | Movies that Prabhas gave up in his 17-year movie career యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ఈరోజుతో ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఓ చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. తరువాత మీడియం రేంజ్ హీరోగానూ .. అటు తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. ఈ 17 ఏళ్ళలో ప్రభాస్ చేసిన సినిమాలు కేవలం 19 మాత్రమే. ఇప్పుడు 20 వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ‘యూవీ క్రియేషన్స్’ వారే నిర్మించబోతుండగా.. ‘గోపికృష్ణ మూవీస్’ వారు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ 17 ఏళ్ళ ప్రభాస్ కెరీర్లో మనకి తెలిసిన 19 సినిమాలు అయితే.. ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా 10 వరకూ ఉన్నాయంటే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! మరి ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి. 1) ఒక్కడు : ఈ చిత్రం మహేష్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే మొదట ఈ చిత్రం ప్రభాస్ చేయాల్సిందట. నిర్మాత యం.ఎస్.రాజు దర్శకుడు గుణశేఖర్ ను తీసుకుని ప్రభాస్, కృష్ణంరాజు లను కలిసి కథ వినిపించారట. అయితే కబడ్డీ గేమ్.. అంటున్నారు స్క్రిప్ట్ కూడా కూడా కొంచెం రిస్క్ గా అనిపించడంతో రిజెక్ట్ చేసారని తెలుస్తుంది. 2) దిల్ : ‘ఈశ్వర్’ నుండీ వినాయక్ అలాగే దిల్ రాజు లతో ప్రభాస్ కు మంచి స్నేహం ఉంది. దాంతో ‘దిల్’ సినిమా మొదట ప్రభాస్ కే వినిపించాడట వినాయక్. కానీ అప్పుడు మరో సినిమాతో బిజీగా ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేసాడని తెలుస్తుంది. 3) సింహాద్రి : రాజమౌళి.. ‘సింహాద్రి’ కథ మొదట ప్రభాస్ కే చెప్పాడు. కానీ ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా చూస్తే చాలా క్లాస్ గా ఉంది.. ఈ మాస్ సబ్జెక్టు ను ఈయన హ్యాండిల్ చేయగలడా అని ఆలోచించి ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేసాడట. 4) ఆర్య : అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు లకి ఈ చిత్రం బాగా స్పెషల్. ఈ సినిమా ఓ గేమ్ చేంజెర్ అని చెప్పుకోవచ్చు. ఈ కథని కూడా సుకుమార్, దిల్ రాజు.. మొదట ప్రభాస్ కి వినిపించారట. ఎందుకో ఈ సినిమాని కూడా డార్లింగ్ ప్రభాస్ రిజెక్ట్ చేసాడు. ప్రభాస్ కంటే ముందు ఈ కథని సుకుమార్.. ‘అల్లరి నరేష్’ కు కూడా వినిపించాడట. ఆయన కూడా రిజెక్ట్ చేసాడని తెలుస్తుంది. 5) బృందావనం : ప్రభాస్ కు ‘మున్నా’ వంటి ప్లాప్ ఇచ్చానని.. అదే గిల్ట్ తో వంశీ బాధపడ్డాడట. తరువాత ‘బృందావనం’ కథని ప్రభాస్ వినిపిస్తే అప్పటికే ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలకి కమిట్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమాని వదిలేసాడని తెలుస్తుంది. 6) నాయక్ : ప్రభాస్ మంచి ఫ్రెండ్ కాబట్టి తనతో ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టాలని.. ‘నాయక్’ కథని సిద్ధం చేసుకున్నాడట వినాయక్. ఈ కథని మొదట ప్రభాస్ కు వినిపించగా… అప్పుడు ‘రెబల్’ ‘మిర్చి’ సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పాడట ప్రభాస్. ఆ తర్వాత ఈ కథని పవన్ కళ్యాణ్ కు కూడా వినాయక్ వినిపించాడట.. కానీ ఏమైందో ఏమో ఇది చరణ్ చేయడం జరిగింది. 7) కిక్ : రవితేజ మార్కెట్ ను రెండింతలు పెంచిన ‘కిక్’ సినిమా కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యే లోపే.. అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సూరి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడట. 8) ఊసరవెల్లి : ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా హీరో ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందేనట. 9) డాన్ శీను : గోపీచంద్ మలినేని మొదట ‘డాన్ శీను’ కథని ప్రభాస్ కోసం రెడీ చేసుకున్నాడట. ‘బుజ్జిగాడు’ లో ప్రభాస్ క్యారెక్టర్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఈ కథని కూడా రెడీ చేసుకున్నాడట గోపీచంద్. దాదాపు సేమ్ ఉండడంతో ప్రభాస్ రిజెక్ట్ చేసాడని.. అందుకే రవితేజ చేసాడని తెలుస్తుంది. 10) జిల్ : ‘బాహుబలి’ తో ప్రభాస్ బిజీగా ఉన్న టైములో ‘జిల్’ కథ ప్రభాస్ వద్దకు వచ్చిందట. డైరెక్టర్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక.. అదే కథని తన స్నేహితుడు గోపీచంద్ కు చేయమని చెప్పాడట. దీంతో ఆ సినిమా గోపీచంద్ చేయడం జరిగింది. ► Source ======================== Maximum data collected from wikipedia. [www.wikipedia.org] ► Used Music ===================== Music provided by Youtube Audio Library https://studio.youtube.com/channel/UCBhybMQLT8E07Kp3BZ1ch6A/music ► Fair Use Disclaimer ====================== This channel may use some copyrighted materials without specific authorization of the owner but contents used here falls under the “Fair Use”. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. ======================================================

0

0
Movie Focus
Subscribers
5.8K
Total Post
130
Total Views
48.9K
Avg. Views
708.8
View Profile
This video was published on 2020-09-04 21:00:01 GMT by @Movie-Focus on Youtube. Movie Focus has total 5.8K subscribers on Youtube and has a total of 130 video.This video has received 0 Likes which are lower than the average likes that Movie Focus gets . @Movie-Focus receives an average views of 708.8 per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that Movie Focus gets . Overall the views for this video was lower than the average for the profile.Movie Focus #Prabhas యంగ్ has been used frequently in this Post.

Other post by @Movie Focus