×

SAI TV Live Telugu's video:

@సాయి బాబా కంటే ముందు షిరిడి ద్వారకామాయి లో ఎవరు నివసించారో తెలుసా? ఇంతవరకు ఎవరికి తెలియని రహస్యం!!?
షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 08 || సాయి బాబా కంటే ముందు షిరిడి ద్వారకామాయి లో ఎవరు నివసించారో తెలుసా? ఇంతవరకు ఎవరికి తెలియని రహస్యం !!? // Shiridi SaiBaba Story // SaiLeela || సాయిబాబా షిరిడీలో నొక మసీదులో నివాస మేర్పరచు కొనిరి. బాబా రాకపూర్వమే దేవిదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరములనుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమున కిష్టపడెను. అతనితో కలసి మారుతీ దేవాలయములోను, చావడిలోను, కొంతకాల మొంటరిగాను ఉండెను. అంతలో జానకీదాసు గోసావి అను నింకొక యోగి యచ్చటకు వచ్చెను. బాబా ఎల్లప్పుడు ఈ యోగితో మాట్లాడుచు కాలము గడుపుచుండువారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీ దాసు పోవుచుండెను. అట్లనే యొక వైశ్యయోగి పుణతాంబే నుంచి వచ్చుచుండెడివాడు. వారి పేరు గంగాఘీరు. అతనికి సంసార ముండెను. అతడు బాబా స్వయముగా కుండలతో నీళ్లుమోసి పూలచెట్లకు పోయుట జూచి యిట్లనెను. "ఈ మణి యిచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్ళు మోయుచున్నాడు. కాని యితడు సామాన్యమానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసికొనినది గనుక సాయిబాబా యను నీ మణిని రాబట్టుకొనగలిగెను." యేవేలా గ్రామములో నున్న మఠములో ఆనందనాథుడను యోగిపుంగవుడుండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజుగారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామనివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను జూచి యిట్లనెను. "ఇది యమూల్యమైన రత్నము. ఈతడు సామాన్యమానవునివలె గాన్పించునప్పటికిని యిది మామూలు రాయికాదు. యిదియొక రత్నమణి. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు." ఇట్లనుచు యేవలా చేరెను. ఇది శ్రీ సాయిబాబా బాల్యమున జరిగిన సంగతి.

1.4K

129
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2021-02-06 07:45:00 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 1.4K Likes which are higher than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 129 comments which are higher than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu