×

SAI TV Live Telugu's video:

@షిరిడి ద్వారకామాయి లోని అత్యద్భుతమైన విశేషాలు ! తెలుసుకొని తరించండి!!
షిరిడి సిరులు // Shiridi Sirulu Ep 07 || షిరిడి ద్వారకామాయి లోని అత్యద్భుతమైన విశేషాలు ! తెలుసుకొని తరించండి !! Shiridi SaiBaba Story // SaiLeela || షిర్డీలో సాయిబాబా నివాసమున్న మసీదు ద్వారకామాయి. ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకూ వచ్చేపట. గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిధిలావస్థలో ఉంది. బాబా ఇక్కడ ధునిని ప్రతిష్టించారు. ఇటుకలు, మట్టి రాలిపడుతూ ఉండేవి. ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది. ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాల మహత్తు ఉంది. విల్లీపార్లేకి చెందిన శ్యాంరావు ఆర్.వి. జయకర్ ఈ చిత్రం గీశాడు. బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసికెళ్ళాడు. నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తుంటాను. ఈ ఫోటో ఇక్కడే ఉండనీ’ అన్నారట సాయిబాబా. అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడనుంచే చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలుంటాయి. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికీ అక్కడ ఉంచుతూ ఉంటారు. షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదులో ఓక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతోమందితో తాగించేవారు. అయినా అందులో నీరు తరిగేది కాదు. ఇప్పటికి చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు. ద్వారకామాయి దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి. రోజూ ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు. ధుని నుంచి ఊదీ తీసి భక్తుల నుదుట పెట్టేవారు. ''మీకు శుభం జరుగుతుంద''ని ఆశీర్వదించేవారు. 1886లో మూడు రోజులపాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతిష్టించారు.

393

87
SAI TV Live Telugu
Subscribers
91.5K
Total Post
6.6K
Total Views
333.4K
Avg. Views
4.5K
View Profile
This video was published on 2021-02-05 19:45:00 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 91.5K subscribers on Youtube and has a total of 6.6K video.This video has received 393 Likes which are higher than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.5K per video on Youtube.This video has received 87 comments which are higher than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu