×

SAI TV Live Telugu's video: SATSANGAM EP 39

@SATSANGAM EP 39 // వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారం
వరాల సాయి మందిరం లో శ్రీ సాయిసత్సంగం అద్వితీయమైన సాయి లీలల సమాహారం // SATSANGAM EP 39 ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధవడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను గాని, అవి గుణము నివ్వలేదు. నిరాశ చెంది, చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా యతని దిండువద్ద నిలచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని "నేను నా జీవితముపై ఆశ వదలుకొన్నాను. నేనెప్పుడు మరణించెదనో దయచెసి చెప్పుడు" అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా "నీ వాతురపడవద్దు, నీ చావు చీటి తీసివేసితిని. త్వరలో బాగుపడెదవు. కాని, తాత్యాకోతేపాటిలుగూర్చి సంశయించుచున్నాను. ఆతడు శక సం. 1840 విజయదశమినాడు (1918) మరణించును. ఇది యెవరికిని తెలియనీయకు; వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును." అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కాని యాతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదనియు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికిని తెలియనీయలెదు. కాని బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్రపాటీలు, బాలాషింపియు, ఈ యిరువురు మాత్రమే తాత్యాగుర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్కనుండి లేచి నడువసాగెను. కాలము వేగముగా కదలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజ మాసము సమీపించుచుండెను. బాబా మాటప్రకారము తాత్యా జబ్బుపడెను. మంచము బట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలే కుండెను. బాబా కూడ జ్వరముతో నుండెను. తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను; బాబా శ్రీ హరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడు బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడ క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరమంతయు చమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చెననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని యనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను, అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు గనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యాకోసమర్పించెనని జను లనుకొనిరి. బాబా యెందుకిట్లు చేసెనో బాబాకే తెలియును. వారి కృత్యము లగోచరములు. ఇవ్విధముగా బాబా తమ సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యాపేరు తెలిపెను. ఆ మరుసటి యుదయము అనగా అక్టోబరు 16వ తేదీన పండరీ పురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి యిట్లనిరి. "మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చీకాకు పెట్టిరి, కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే గప్పుము." షిరిడినుండి వచ్చిన ఉత్తరమువలన కూడ దాసగణుకీ సంగతి దెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజనకీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందురోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేయుచు నొక చక్కని పువ్వుల హారమును స్వయముగా గ్రుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను.

37

0
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2023-05-06 09:36:10 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 37 Likes which are lower than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu