×

SAI TV Live Telugu's video: SATSANGAM EPISODE 85

@SATSANGAM EPISODE 85 //సత్సంగానికి మించిన మిత్రులు, ఆప్తులు మరొకరు ఉండరు.
SATSANGAM EPISODE 85 //సత్సంగానికి మించిన మిత్రులు, ఆప్తులు మరొకరు ఉండరు. సాయికథా శ్రవణమే భక్తుడికి సర్వస్వాన్నిస్తుంది. ఓ సాయి! నీ పాదములు పవిత్రము లయినవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధములనుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది. ప్రస్తుతము నీరూప మగోచరమయినప్పటికి, భక్తులు నీయందే నమ్మక ముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటి కగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరనుండిగాని యెంతోదూరమునుండిగాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగిలించుకొనెదవు. నీ వెక్కడున్నావో నీ భక్తులకు దెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు శక్తివలన నిరాడంబరభక్తుల రక్షించెదవు. ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవే పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపములనుండి విముక్తి పొందుట యెట్లన-శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుని కోరికలను నీవు నెరవేర్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్వికగుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనేయనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరాణాగతి. దీనికి తప్పనిసరి యొకేగుర్తు - మన మనస్సు నిశ్చలము శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు, విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము, ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమునగాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తనయిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము, బాబా అచ్చటకు భక్తునికంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరానిరూపమున నుండును.

105

19
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2024-05-25 09:42:07 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 105 Likes which are higher than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 19 comments which are higher than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu