×

SAI TV Live Telugu's video: SATSANGAM EPISODE 90

@SATSANGAM EPISODE 90 //సాయి మార్గంలో సేవ అంటే ఏమిటి? అది దేనితో ముడిపడి ఉంటుంది?
SATSANGAM EPISODE 90 //సాయి మార్గంలో సేవ అంటే ఏమిటి? అది దేనితో ముడిపడి ఉంటుంది? దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి యీ యధ్యాయమును ముగించెదము. బాబాను జూచుటకు వెళ్లిన వారినుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట యందరికి తెలిసిన సంగతే. బాబా ఫకీరయినచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో, వారు దక్షిణ నెందు కడుగవలెను? వారు ధనమునేల కాంక్షించవలెనని యెవరైన అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధాన మిది. మొట్టమొదట బాబా యేమియు పుచ్చుకొనెడివారు కారు. కాల్చిన యగ్గివుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు. భక్తులనుగాని తదితరులను గాని బాబా యేమియు నడిగెడివారు కారు. ఎవరైనా నొకటి కాణి గాని రెండు కాణులు గాని యిచ్చినచో దానితో నూనె, పొగాకు కొనెడివారు. బీడిగాని చిలుముగాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాణి యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడి వారు. అర్థణా అయినచో తిరిగి యిచ్చేవారు. బాబాగారి కీర్తి యన్నిదిశలకు వ్యాపించినతరువాత అనేకమంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ యడుగుచుండెను. "దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే యా పూజ పూర్తికాదు" అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగులపూజలోమాత్రమేల యుండరాదు? శాస్త్రములలో గూడ నేమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెముగాని డబ్బుగాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి యుపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు 'ద' యను నక్షరమును బోధించెను. ఈ అక్షరమువల్ల దేవతలు 'దమము' నవలంబించవలెనని గ్రహించిరి. (అనగా నాత్మను స్వాధీనమందుంచుకొనుట). మానవులు ఈ యక్షరమును 'దానము' గా గ్రహించిరి. రాక్షసులు దీనిని 'దయ' యని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమ మేర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణముల నభ్యసించ వలయునని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగను, అణుకువతోను, భయముతోను, కనికరముతోను చేయవలెను. భక్తులకు దానముగూర్చి బోధించుటకు, ధనమందు వారికిగల అభిమానమును పోగొట్టుటకు వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ యడుగుచుండెను. కాని ఇందులో నొక విశేషమున్నది. బాబా పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక యుదాహరణము. గణపతిరావు బోడన్ యను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు, దీని ఫలితముగా ఆనాటినుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియు వ్రాసెను. ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడన్ కు దొరుకుచుండెను. దక్షిణ యడుగగా ధనమీయ నక్కరలేదను నర్థము గూడ పెక్కు సంఘటనలవలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండుదాహరణములు. (1) బాబా 15రూపాయలు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్ జి.జి.నార్కే నడుగగా, నతడు తనవద్ద దమ్మిడీయయిన లేదనెను. బాబా యిట్లనెను. "నీ వద్ద ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగవాసిష్ఠము చదువుచున్నావు. దానినుంచి నాకు దక్షిణ యిమ్ము." దక్షిణ యనగా నిచ్చట గ్రంథమునుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమనియే యర్థము. (2) ఇంకొకసారి బాబా, తరఖడ్ భార్యను 6రూపాయలు దక్షిణ యిమ్మని యడిగెను. ఆమెవద్ద పైకము లేకుండుటచే నామె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త యక్కడనే యుండుటచే బాబా వాక్కులకు అర్థము జెప్పెను. ఆమె యొక్క యారుగురు శత్రువులను (కామ క్రోధ లోభాదులు) బాబాకు పూర్తిగ సమర్పించవలెనని యర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణరూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికి దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి యుదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణరూపముగా పుచ్చుకొనినను బాబా మహా సమాధి పొందు నప్పటికి 9రూపాయలు మాత్రమే వారిచెంత మిగిలెను. వేయేల బాబా దక్షిణపుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుటకొఱకే. దక్షిణగూర్చి యింకొకరి వర్ణన బి.వి. దేవ్ ఠాణానివాసి; ఉద్యోగము విరమించుకొనిన మామలతుదారు, బాబా భక్తుడు, దక్షిణగూర్చి శ్రీ సాయిలీలా వారపత్రికలో నిట్లు వ్రాసియున్నారు. బాబా యందరిని దక్షిణ యడుగువారు కారు. అడుగకుండ ఇచ్చినచో నొక్కొక్కప్పుడు పుచ్చుకొనెడివారు; ఇంకొక్కప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తులవద్ద దక్షిణ యడుగుచుండెను. బాబా యడిగినచో యిచ్చెదమనుకొను వారివద్ద బాబా దక్షిణ పుచ్చుకొనెడి వారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైన దక్షిణ యిచ్చినచో, బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైన తమ ముందుంచినచో దానిని తీసికొని పొమ్మనుచుండిరి. బాబా యడిగెడు దక్షిణ పెద్ద మొత్తములుగాని చిన్నమొత్తములుగాని భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యముల బట్టి యుండును. స్త్రీలు, పిల్లలవద్ద కూడ బాబా దక్షిణ యడుగుచుండెను. వారు, అందరు ధనికులనుగాని అందరు బీదలనుగాని దక్షిణ యడుగలేదు. అడిగినను దక్షిణ యియ్యనివారిపై బాబా కోపించి యుండలేదు. ఎవరి ద్వారానైన భక్తులు దక్షిణ పంపినచో, వారు దానిని మరచునప్పుడు, వారికి దానిని గూర్చి జ్ఞప్తికి దెచ్చి, దక్షిణము పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణనుంచి కొన్ని రూపాయలు తిరిగియిచ్చి, పూజలో పెట్టుకొని పూజించు మనువారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము గనిపించుచుండెను. అనుకున్న దానికంటె నెక్కువ యిచ్చినచో, కావలసినదానినే యుంచుకొని మిగతాదానిని తిరిగి యిచ్చివేయుచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనినదానికంటె నెక్కువగా ఇవ్వుమనుచుండువారు. లేదనినచో నెవరివద్దనయిన బదులు పుచ్చుకొనిగాని, అడిగిగాని ఇవ్వుమనుచుండెను. కొందరివద్దనుంచి యొకరోజు మూడు నాలుగుసారులు దక్షిణ కోరుచుండెను. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి కొంచెముమాత్రమే చిలుమునకు, ధునికొరకు ఖర్చుపెట్టుచుండెను. మిగతదాని నంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50రూపాయలు మొదలు ఒక రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు.

113

29
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2024-06-29 10:01:07 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 113 Likes which are higher than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 29 comments which are higher than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu