×

SAI TV Live Telugu's video: Sai Gurukulam Episode 1006 II Speeches on Satcharitra anilkumar II saitv

@Sai Gurukulam Episode 1006 II Speeches on Satcharitra #anilkumar II saitv
Sai Gurukulam Episode 1006 II Speeches on Satcharitra II saitv వీరు రెవన్యూశాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వేపార్టీతో వచ్చెను. అక్కడ ‘అప్ప’ యను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆయోగి నిశ్చలదాసు రచించిన ‘విచార సాగర’ మను వేదాంతగ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. “ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చెసినచో నీకోరికలు నెరవేరును. ముందుముందు నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ వొక గొప్పయోగిని యదృష్టముచే కలిసికొనెదవు. వారు నీ భవిష్యత్తుమార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీ కానందము కలుగజేసెదరు.” ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాల కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప యితరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతు పై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటనుండి కల్యాణ్ కు పెద్ద యుద్యోగముపై బదిలి యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయనవలన సాయిబాబాగూర్చి యనేకసంగతులు తెలిసికొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటిదినమే నానాసాహెబు షిరిడీపోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడ రమ్మని యడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి షిరిడీ వెళ్ళెను. అంతకుముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతరస్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబావద్దకు దీసికొనిపోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారి చేయునంత సులభము కాదు. ఈ యధ్యాత్మికమార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును. ఠాకూ రొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానందపరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండుచేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించ వలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. అప్పా చెప్పినదంతయు నిజమే కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి యాచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమియు నుండదు. గురుని యాశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞాన మాత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంతభాగ మాతడు చదివియుండెను, గాని యాచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ యింకొక కథ కూడ నీ సత్యమును బలపరచును.

64

0
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2023-05-05 09:49:07 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 64 Likes which are lower than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.SAI TV Live Telugu #anilkumar has been used frequently in this Post.

Other post by @SAI TV Live Telugu