×

SAI TV Live Telugu's video: Sai Gurukulam Episode 1004 II PA 02 II Speeches of saibaba anilkumar II saitv

@Sai Gurukulam Episode 1004 II PA 02 II Speeches of saibaba #anilkumar II saitv
Sai Gurukulam Episode 1004 II PA 02 II Speeches of saibaba II saitv బాబా సమాధి చెందుటకు 7రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై నినుపగొలుసులతో కట్టియుంచిన పులి యుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను. దానిని ముగ్గురు దూర్వీషులు పెంచుచు ఊరూరు త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జోవనోపాధి. ఆ పులి యేదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసికొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారమువద్ద నిలబెట్టి, దూర్వీషులు బాబా వద్దకు బోయి దాని విషయ మంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు దీసికొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసికొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక యది తల వాల్చెను. బాబా దానివైపు చూడగా, నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట జూచి దూర్వీషులు విరక్తి జెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే నది బాబా సముఖమున వారి పాదములవద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మపుణ్యమే యని భావించిరి. అది వారికి బాకీపడి యుండెను. దాని బాకీ తీరిన వెంటనే యది విమోచనము పొంది, బాబా పాదములచెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింప బడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి యెట్లు కలుగును?

42

0
SAI TV Live Telugu
Subscribers
91.5K
Total Post
6.6K
Total Views
333.4K
Avg. Views
4.5K
View Profile
This video was published on 2023-05-03 09:52:09 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 91.5K subscribers on Youtube and has a total of 6.6K video.This video has received 42 Likes which are lower than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.5K per video on Youtube.This video has received 0 comments which are lower than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.SAI TV Live Telugu #anilkumar has been used frequently in this Post.

Other post by @SAI TV Live Telugu