×

SAI TV Live Telugu's video: Sai GurukulamEpisode1306

@Sai GurukulamEpisode1306//వక్రమార్గంలో ఉన్న కుశా భావు లక్ష్యాన్ని సన్మార్గంలోకి బాబాఎలాతీసుకెళ్లారు?
Sai Gurukulam Episode 1306 //వక్రమార్గంలో ఉన్న కుశా భావు లక్ష్యాన్ని సన్మార్గంలో కి బాబా ఎలా తీసుకెళ్లారు? సాయిభక్తుడు కుశాభావు అలియాస్ కృష్ణాజీ కాశీనాథ్ జోషీ 1866వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషీ అహ్మద్‌నగర్ నుండి 70 మైళ్ల దూరంలో ఉన్న మీర్జాగాఁవ్‌లో ఒక గ్రామ వతనదారుగా ఉండేవాడు. అతనికి ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉండేవి. అతను ధనవంతుడు కాకపోయినప్పటికీ ఉన్నంతలో పేదలకు, రోగగ్రస్తులకు సహాయం చేస్తూ జీవితంలో ఎక్కువభాగం సామాజిక సేవాకార్యక్రమాలలో గడుపుతుండేవాడు.గ్రామంలో ఉన్న మారుతి మందిరానికి ప్రతిరోజూ వెళ్లి పూజ నిర్వహిస్తుండేవాడు.  ఒకరోజు అలా వెళ్ళినప్పుడు ఆ మందిరం వద్ద పులిచర్మాన్ని ధరించి ఉన్న ఒక సాధువు కూర్చొని ఉండడం కుశాభావు చూశాడు. ఆ సాధువు చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి అతనికి కనిపించింది. కుశాభావు తన అలవాటు ప్రకారం మందిరం లోపలకి వెళ్లి మారుతికి పూజ ముగించిన తరువాత బయటకి వచ్చి ఆ సాధువుకి నమస్కరించాడు. ఆ సాధువు నామధేయం 'దత్తమహరాజ్'  కుశాభావు దత్తమహరాజ్ శిక్షణలో యోగాసనాలు, ప్రాణాయామం, కుండలిని మేల్కొల్పడం మొదలైన విద్యలు నేర్చుకున్నాడు. కానీ యుక్తవయస్సులో ఉన్న అతనికి వాటితో తృప్తి కలుగలేదు. తన గురువుకి తెలిసిన మారణం, ఉచ్ఛాటనం, వశీకరణం మొదలైన విద్యలు నేర్పమని పట్టుబట్టాడు. అవి నేర్పడం గురువుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ కుశాభావు బాగా ఒత్తిడి చేయడంతో అయిష్టంగానే వాటిని అతనికి నేర్పడానికి అంగీకరించాడు. గురువు చెప్పినట్లు అందుకు అవసరమైన జపం, సాధన  కుశాభావు చేశాడు. అతను ఒక ఇనుప కడియాన్ని ధరించి మంత్రాలను నిర్ణీత సంఖ్యలో నిష్ఠగా జపించి కొద్దికాలంలోనే తాను ఆశించిన శక్తులను వశపరుచుకున్నాడు.   "శిరిడీలో ఉన్న నా జ్యేష్ఠ సోదరుడు సాయిబాబా దగ్గరికి వెళ్లి వారు చెప్పినట్లు నడచుకో" అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తరువాత కుశాభావుకి ఆయన మళ్ళీ కనిపించలేదు, వారి గురించి ఏ వివరాలూ తెలియలేదు. చాలా సంవత్సరాల తరువాత, అంటే 1908లో కుశాభావు తన గురువు ఆదేశానుసారం శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. "ఇనుప కడియాన్ని పారవేసి, మంత్రప్రయోగం ద్వారా పేడాలు సృష్టించడం మాననిదే తమతో ఉండేందుకు అనుమతించమ"ని బాబా ఖరాఖండిగా చెప్పారు.  కుశాభావు పూర్తిగా మూడు సంవత్సరాలు బాబా సన్నిధిలో గడిపాడు అలా కుశాభావు తొమ్మిది సంవత్సరాల కాలంలో తరచూ శిరిడీ దర్శిస్తుండేవాడు. ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా, “ఆ మూడుతలలవాణ్ణి చూడు" అని అతనితో అన్నారు. దాన్ని అతను గాణుగాపురం వెళ్లి దత్తాత్రేయుని దర్శించమన్న బాబా ఆదేశంగా భావించాడు. ఇక అప్పటినుండి అతను సంవత్సరానికి రెండుసార్లు, గురుపౌర్ణమికి ఒకసారి, మాఘపౌర్ణమికి ఒకసారి గాణుగాపురం వెళ్తుండేవాడు. ఇంకొకసారి బాబా మూడురోజులకి ఒక పారాయణ చొప్పున గురుచరిత్ర 108 పారాయణలు చేయమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం అతను 10, 11 నెలలు గాణుగాపురంలో ఉండి 108 పారాయణలు పూర్తి చేశాడు. కుశాభావు చేత మంత్రశక్తులు ఉపయోగించడాన్ని నిషేధించిన బాబా దయతో అతనికి ఒక అద్భుతశక్తిని ప్రసాదించారు. అదెలా జరిగిందో చూడండి! "అద్భుత వరం వల్ల లభించిన ఈ ఊదీని విశ్వాసంతో నా నుండి ప్రసాదం కోరే భక్తులకు పంచిపెడతాను. అది వారి బాధలను, పలురకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ప్రసాదించేది. ఈ శక్తి ఒక్కసారిగా నాలో నిక్షిప్తమైంది. నేను చేతుల్లోకి ఊదీని సృష్టించడమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్ఛరించడం వల్ల జరిగేది కాదు, కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమయింది. కానీ చేతుల్లోనికి పేడాలు, మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడాగాని, మిఠాయిగాని మరోచోట నుంచి తెప్పించబడేవి. అంటే ఒక చోట నుండి మరొక చోటికి బదిలీ చేయడం అన్నమాట. అందుకే బాబా దీనిని నిషేధించారు". 1944, ఫిబ్రవరి 19, శనివారం, మాఘ బహుళ దశమి, మధ్యాహ్నం 12:00 గంటలకు కుశాభావు తుదిశ్వాస విడిచాడు. తన మరణానికి ముందు కులకర్ణి మరియు ఇతర శిష్యవర్గానికి కొన్ని సూచనలు. తన ఇష్టదైవాలైన సాయిబాబా, దత్తాత్రేయులను అభిషేకించిన జలాలు తన సమాధి మీదుగా జాలువారాలని కుశాభావు కోరిక. ఆ కోరికను ‘సద్గురు దాస్ కీ సేన్ సాయిబాబా' మండలిని ఏర్పాటు చేసిన అతని శిష్యులు నెరవేర్చారు. రెండు కారణాల వలన కుశాభావు సమాధి ఉన్న మందిరం పూణేలో ప్రసిద్ధి గాంచింది. మొదటిది, ఇక్కడ సేవ చేసిన వారి కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం. అత్యంత విశిష్టమైన మరో కారణం ఏమిటంటే, ఇక్కడి సమాధిపై ఉన్న పాలరాతి మీద సాయిబాబా మానవాకృతిలో దర్శమిస్తుంటా

143

47
SAI TV Live Telugu
Subscribers
98K
Total Post
7.1K
Total Views
351.1K
Avg. Views
4.1K
View Profile
This video was published on 2024-06-21 09:34:07 GMT by @SAI-TV-Live-Telugu on Youtube. SAI TV Live Telugu has total 98K subscribers on Youtube and has a total of 7.1K video.This video has received 143 Likes which are higher than the average likes that SAI TV Live Telugu gets . @SAI-TV-Live-Telugu receives an average views of 4.1K per video on Youtube.This video has received 47 comments which are higher than the average comments that SAI TV Live Telugu gets . Overall the views for this video was lower than the average for the profile.

Other post by @SAI TV Live Telugu