×

naмaн ѕнιvaya's video: About Rajahmundry

@About Rajahmundry || రాజమహేంద్రి (రాజమండ్రి) చరిత్ర మరియు విశిష్టత ||
Explains About Greatness of Rajahmundry: The city is known for its historic traditional, cultural, agricultural, and economic backgrounds and hence, it is known as the Cultural Capital of Andhra Pradesh. One of the longest road cum rail bridges across the Godavari River connects the city with the town of Kovvur. The ancient Kotilingeshwara Temple is dedicated to the Hindu deity Shiva. రాజమహేంద్రి (రాజమండ్రి) చరిత్ర మరియు విశిష్టత: రాజమహేంద్రి తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక నగరo. రాజమండ్రి పూర్వపు పేరు రాజమహేంద్రి. ఇది రాజరాజనరేంద్రుడు పరిపాలించిన నగరం. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరం పేరు బ్రిటిషుపాలనలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. రాజమండ్రి నగరం ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ముఖ్య వాణిజ్య కేంద్రము. ఆర్థిక, సాంఘిక, మరియు రాజకీయ పరంగా రాజమండ్రి నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాజమండ్రి నగరం ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవ అతి పెద్ద నగరము. గోదావరి నది మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, అను ఐదు ఉపనదులు కలియుచూ రాజమండ్రి వద్ద అఖండ గోదావరి గా మారుతుంది, ఈ పుణ్య క్షేత్రంలో పన్నెండేళ్ళకొకసారి పవిత్రగోదావరి నది పుష్కరాలు చాలా ఘనంగా జరుగుతాయి. రాజరాజ నరేంద్రుడు పరిపాలనలో కవిత్రయంలో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించాడు. ఈ నగరం "మహాభారతము" తెలుగు భాషలో పుట్టిన ప్రదేశము. రాజమహేంద్రి చరిత్ర: రాజమహేంద్రిని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతారు. చరిత్రకారుల కథనం ప్రకారం (క్రీ.శ.919-934) సంవత్సరాల మధ్య అమ్మరాజు విష్ణువర్ధన రాజు, ఆయన తరువాత అమ్మరాజు విజయాదిత్యుడు (క్రీ.శ.945-970) రాజమండ్రి పరిపాలన చేశారు అని చెబుతారు. రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ. 1019–1061) దక్షిణ భారతదేశంలో వేంగి రాజ్యం యొక్క తూర్పు చాళుక్య రాజు. అతని పరిపాలనలో రాజమహేంద్రవరం సామాజిక, సాంసృతిక ప్రాముఖ్యకత సంపాదించుకొంది. నరేంద్రుడు తరువాత విజయాదిత్యుడు (1062-1072), కుళోత్తుంగ చోళుడు, రాజరాజవేంగి-2 రాజమండ్రిని పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజమండ్రికి ప్రముఖస్థానం వున్నది. 1323 తుగ్లక్ (ముహమ్మద్ బిన్ తుగ్లక్) ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమండ్రి నడిబోడ్డులో ఉన్న మసీదు ఈ తుగ్లక్ పరిపాలాన కాలంలోనే వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని పడగొట్టి (వేంగి చాళుక్యులు నిర్మించిన) నిర్మించబడినది. ఆ తరువాత రెడ్డి రాజులు (1353-1448) తుగ్లక్ కు వ్యతిరేకంగా ఉద్యమించి గెలిచారు. ఆ తరువాత కపిలేశ్వర గజపతి, బహమనీ సుల్తానులు, పురుషోత్తమ గజపతి, శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్ర గజపతి, రాజమండ్రిని ఏలిన రాజులు. రాజమహేంద్రి స్తల పురాణము: శ్రీ చక్ర విలసవము అను గ్రంధములో శ్రీ చక్ర అవిర్భావము గురించిన రెండు పౌరాణిక గాథలలోని రెండవ కథ ఈ విధముగా చెప్పబడినది. ఈ కథ బ్రహ్మాండ పురాణమునకు చెందినది. భండాసురుని జయించుటకై శ్రీదేవిని ఉద్దేశించి ఇంద్రుడు మహా యజ్ఞము చేసెను. ఆ యజ్ఞమున దేవతలు తమతమ శరీరమాంసములను కోసి హోమద్రవ్యముగా నొసగిరి. దేవతల త్యాగమునకు సంతోషించిన శ్రీదేవి కోటిసూర్య సమమైన తేజముతోను, కోటిచంద్ర శీతలమయూఖములతోను ఆ హోమాగ్ని మధ్యమున ప్రత్యక్షమయ్యెను. శ్రీదేవి జ్యోతీరూపమైన శ్రీచక్రమధ్యగతమై ప్రత్యక్షమైనది. (ఈ వృత్తాంతమునే లలితాసహస్రనామావళిలో 'చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా' (4,5 నామములు) అనునవి వెల్లడించుచున్నవి. ఈ వృత్తాంతసందర్బమైన యజ్ఞము నేటి గోదావరి నదీ తీరమున రాజమహేంద్రవరమున గల కోటిలింగ క్షేత్రమున జరిగినదనూ అక్కడే శ్రీ చక్రముతో రాజరాజేశ్వరీదేవి ఉద్భవించుటచేత - ఆ ప్రదేశము రాజరాజేశ్వరీ మందిరమై - రాజమహేంద్రవరముగా మారిపోయిందని స్థలపురాణము.

306

25
naмaн ѕнιvaya
Subscribers
465K
Total Post
41
Total Views
646.4M
Avg. Views
3.3M
View Profile
This video was published on 2013-01-08 11:57:21 GMT by @na%D0%BCa%D0%BD-%D1%95%D0%BD%CE%B9vaya on Youtube. naмaн ѕнιvaya has total 465K subscribers on Youtube and has a total of 41 video.This video has received 306 Likes which are lower than the average likes that naмaн ѕнιvaya gets . @na%D0%BCa%D0%BD-%D1%95%D0%BD%CE%B9vaya receives an average views of 3.3M per video on Youtube.This video has received 25 comments which are lower than the average comments that naмaн ѕнιvaya gets . Overall the views for this video was lower than the average for the profile.naмaн ѕнιvaya #RajaMahendraVaram #Rajahmundry #RajaMahendri has been used frequently in this Post.

Other post by @na%D0%BCa%D0%BD %D1%95%D0%BD%CE%B9vaya